
అసోంలోని శివసాగర్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల శ్రవణ్ కుమార్, తన ప్రాణాలను పణంగా పెట్టి వరదల్లో చిక్కుకున్న 2,000 మందిని సురక్షితంగా కాపాడాడు.
జూలై 19న ప్రారంభమైన వరదల్లో ఎలాంటి రెస్క్యూ శిక్షణ లేకపోయినా, తన సంప్రదాయ చెక్క పడవ 'తులుంగా నావ్' సాయంతో ఐదు గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టాడు.
ప్రస్తుతం అసోంలో వరద ప్రభావంతో 1.78 లక్షల మంది ఉండగా, ఇప్పటివరకు 82 మంది మరణించినట్లు అధికారిక సమాచారం.