
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దుర్వినియోగం వల్ల భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ హెచ్చరించారు.
ఏఐ సాంకేతికత దురుద్దేశం కలిగిన వ్యక్తుల చేతుల్లోకి వెళితే సైబర్ దాడులు, మోసాలు పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు.
ఏఐ అభివృద్ధి వేగంగా జరుగుతున్న సమయంలో దానికి తగినట్లుగా భద్రతా చర్యలు కూడా చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.