
ట్రంప్ ఆర్గనైజేషన్ ఖాతాలను మూసివేయడం వెనుక రాజకీయ కారణాలు లేవని, మనీ లాండరింగ్ సందేహాలే కారణమని క్యాపిటల్ వన్ బ్యాంక్ ఫెడరల్ కోర్టుకు తెలిపింది.
2021లో ట్రంప్ కుటుంబానికి చెందిన 300కి పైగా ఖాతాలను అంతర్గత నియమావళి ప్రకారమే క్లోజ్ చేశామని బ్యాంక్ స్పష్టం చేసింది.
ట్రంప్ తనపై దాఖలు చేసిన 5 బిలియన్ డాలర్ల పరిహార దావాను బ్యాంక్ తోసిపుచ్చింది.