
2016లో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన రిలయన్స్ జియో, దేశవ్యాప్తంగా డిజిటల్ సేవలను విస్తరిస్తూ పదేళ్లు పూర్తి చేసుకుంది.
తెలంగాణ విభాగంలో నిర్వహించిన దశాబ్ది వేడుకల్లో మొబిలిటీ, హోమ్, ఎంటర్ప్రైజ్ విభాగాల్లో సాధించిన పురోగతిని ఉద్యోగులు గుర్తుచేసుకున్నారు.
రానున్న పదేళ్లలో 5జీ, కనెక్టెడ్ హోమ్స్ వంటి కొత్త సాంకేతిక సేవల్లో భారీ అవకాశాలు ఉన్నాయని జియో తెలంగాణ సీఈఓ కే.సీ. రెడ్డి తెలిపారు.