
దర్శకధీర ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ 'వారణాసి' కథ వారణాసిలో మొదలై అంటార్కిటికా, ఆఫ్రికా మరియు ప్రాచీన రోమ్ సామ్రాజ్యం వరకు సాగుతుందని వెల్లడైంది.
సినిమా టీజర్‌లో కథను పూర్తిగా రివీల్ చేయకుండా, ప్రేక్షకులు థియేటర్లలో పొందబోయే అద్భుతమైన అనుభూతిని మాత్రమే చూపించామని రాజమౌళి తెలిపారు.
ప్రపంచవ్యాప్త పర్యటన, చారిత్రక అంశాలతో కూడిన ఈ భారీ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.