
లండన్‌లో ఉద్యోగాల పేరుతో రూ.8 కోట్లు వసూలు చేసి మోసం చేసిన కేసులో యూట్యూబర్ 'నందూస్ వరల్డ్' నందనను పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు.
డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో కార్యాలయాలు నిర్వహించి వీసా రెన్యువల్స్ పేరుతో మోసాలకు పాల్పడినట్లు నందన, ఆమె భర్త మధుకర్‌లపై కేసులు నమోదయ్యాయి.
గత ఏడాది డిసెంబరులో నమోదైన ఈ కేసులో లుకౌట్ నోటీసులు జారీ చేయగా, బ్రిటన్ నుండి తిరిగి వస్తుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.