
హర్యానాలోని హిసార్ జిల్లా ఆర్యా నగర్ గ్రామంలో ఒకే గ్రామానికి చెందిన వారు ప్రేమ వివాహాలు చేసుకుంటే సామాజిక బహిష్కరణ చేయాలని పెద్దలు తీర్మానించారు.
ఆదివారం జరిగిన ఈ సామాజిక పంచాయతీకి సుమారు 1,000 మంది హాజరయ్యారని స్థానికులు తెలిపారు.
అయితే ఈ నిర్ణయంతో గ్రామ పంచాయతీకి ఎలాంటి సంబంధం లేదని సర్పంచ్ స్పష్టం చేయగా, పోలీసులు జంటలకు రక్షణ కల్పిస్తామని తెలిపారు.