
కోల్‌కతాలో నివసిస్తున్న ఐర్లాండ్ పౌరుడొకరు భారత పౌరసత్వం పొందడానికి పట్టే సమయం గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ 'గ్రోక్'ను ప్రశ్నించారు.
భారత సహజ పౌరసత్వం పొందాలంటే కనీసం 12 ఏళ్లు దేశంలో నివసించాలని, ద్వంద్వ పౌరసత్వానికి అనుమతి లేదని గ్రోక్ స్పష్టం చేసింది.
ఈ సమాధానంపై ఎక్స్ వేదికగా స్పందించిన ఎలాన్ మస్క్ 'భారత్ వాస్తవిక దృక్పథంతో ఉంది' (India is realistic) అంటూ వ్యాఖ్యానించారు.