
అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలోని పినకోట వద్ద రోడ్డు నిర్మాణానికి తీసుకెళ్తున్న జిలెటిన్ స్టిక్స్ పేలడంతో ఐదుగురు మృతి చెందారు.
వాహనంలో డీజిల్ నింపుతుండగా మంటలు అంటుకుని ఈ ప్రమాదం జరిగిందని, మృతుల్లో ఉపాధ్యాయురాలు సునీత, ముగ్గురు కార్మికులు, డ్రైవర్ ఉన్నారని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.