
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా జరిపిన క్షిపణి, డ్రోన్ దాడుల్లో జగిత్యాల జిల్లాకు చెందిన వావిలాల సుదర్శన్ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు.
ఉపాధి కోసం నాలుగు నెలల క్రితమే ఉక్రెయిన్ వెళ్లిన సుదర్శన్, గది నుండి బయటకు వస్తుండగా క్షిపణి దాడికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరగా, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.