
మయన్మార్‌లో పెరుగుతున్న ఆన్‌లైన్ స్కామ్‌లు, క్రిప్టోకరెన్సీ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం మంగళవారం కఠినమైన 'యాంటీ-ఆన్‌లైన్ స్కామ్ బిల్లు'ను ఆమోదించింది.
ఈ చట్టం ప్రకారం ఆన్‌లైన్ స్కామ్ సెంటర్లు నడిపేవారికి జీవిత ఖైదు, నేరాల వల్ల మరణం సంభవిస్తే నేరస్థులకు మరణశిక్ష విధించేలా నిబంధనలు రూపొందించారు.
యుద్ధంతో అల్లకల్లోలంగా ఉన్న మయన్మార్ సరిహద్దు ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని జరుగుతున్న రొమాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ మోసాలను అణచివేయడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యం.