రిలయన్స్ కాంపా కోలా నుంచి వస్తున్న గట్టి పోటీని ఎదుర్కొనేందుకు, కోకా కోలా ఇండియా ఈ ఏడాది జీరో-కెఫీన్, జీరో షుగర్ కోక్‌ను విడుదల చేయనుంది.
ప్రస్తుతం శీతల పానీయాల మార్కెట్లో జీరో, లో షుగర్ విభాగం 30-35 శాతానికి చేరుకుందని పరిశ్రమ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
అధిక కెఫీన్ వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరికల నేపథ్యంలో, ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాల కోసం వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.