
కాకినాడలో ఒక మహిళ తన భర్త ద్వారా బలవంతపు మతమార్పిడికి గురయ్యానని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.
ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా, బాధితురాలు తన భర్త ఆరుగురు మహిళలతో సహజీవనం చేస్తున్నాడని ఆరోపించింది.
ఇటీవల జరిగిన పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు కుటుంబ సామూహిక ఆత్మహత్య ఘటన మరువక ముందే ఈ అమానుషం వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపింది.