
ఢిల్లీ ప్రజా పనుల శాఖ మంత్రి పర్వేశ్ వర్మ రహదారి పరిశీలనకు వెళ్లిన సమయంలో వీడియో తీస్తున్న ఓ యువకుడిని కొట్టారు.
మంత్రి తన ఎడమ చేతితో యువకుడి మొబైల్‌ను కిందకు లాగేసి, కుడి చేతితో చెంపపై కొట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది.
ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తూ మంత్రిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.