
పెట్రోలియం లెవీ పన్నులు మరియు నిత్యావసర ధరల పెంపును నిరసిస్తూ పాకిస్థాన్ వ్యాప్తంగా జమాత్-ఎ-ఇస్లామీ ఆధ్వర్యంలో లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు.
ప్రస్తుతం పాకిస్థాన్‌లో పెట్రోల్ ధర లీటరుకు 459 పాకిస్తానీ రూపాయలు, డీజిల్ ధర 520 పాకిస్తానీ రూపాయలకు చేరి ప్రపంచంలోనే రెండో అత్యధిక ఇంధన ధరలు కలిగిన దేశంగా నిలిచింది.
ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పన్నులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, రానున్న రోజుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని జమాత్-ఎ-ఇస్లామీ అధినేత హఫీజ్ నయీముర్ రెహమాన్ హెచ్చరించారు.