
యుద్ధాన్ని ముగించేందుకు దౌత్య ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రష్యా దాడులతోనే సమాధానమిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు.
కీవ్‌తో పాటు విన్నిట్సియా, మైకోలైవ్, ఖార్కివ్, ఒడెస్సా సహా 11 ప్రాంతాల్లోని ఇంధన మౌలిక సదుపాయాల కేంద్రాలపై దాడులు జరగగా పదికి పైగా కేంద్రాలు ధ్వంసమయ్యాయి.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు యుద్ధాన్ని ఆపే ఆసక్తి లేదని, వాషింగ్టన్ మాస్కోపై ఆంక్షలు సడలించడం పరోక్షంగా ప్రయోజనం చేకూరుస్తోందని ఆయన విమర్శించారు.