
హంగేరీలో జరిగిన కనిసా ఓపెన్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ ఎం. ప్రణేశ్ విజేతగా నిలిచాడు.
చివరి రౌండ్‌లో జర్మనీకి చెందిన వాదిమ్ పెట్రోవ్‌స్కీపై గెలుపొందిన ప్రణేశ్, మొత్తం తొమ్మిది రౌండ్లలో ఏడు పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
ప్రస్తుతం ఫిడే ర్యాంకింగ్స్‌లో 44వ స్థానంలో ఉన్న ప్రణేశ్, ఈ టోర్నీలో వ్యూహాత్మక ఎత్తులతో ప్రత్యర్థులను ఓడించాడు.