
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ విశాఖపట్నంలో తన AAA సినిమాస్ మల్టీప్లెక్స్‌ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు.
వైజాగ్ తనకు ఎంతో ప్రత్యేకమని, గంగోత్రి సినిమా రోజుల్లో స్వేచ్ఛగా తిరిగిన ఈ నగరంలో ఇప్పుడు తన పేరు మీద థియేటర్ రావడం కల నిజమైన క్షణమని ఆయన పేర్కొన్నారు.
ఈ థియేటర్‌లో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించామని, ఇది వైజాగ్ ప్రజలకు తన అంకితమని బన్నీ తెలిపారు.