
ఈనెల 28న నారా లోకేశ్ ఒంగోలు, ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గాల్లో పర్యటించనుండగా, 31న సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు.
లోకేశ్ పర్యటనలో భాగంగా 28న ఉదయం 9.30 గంటలకు రవిప్రియ రాడిసన్ హోటల్ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం జరగనుంది.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయకుమార్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.