
తెలంగాణలో సన్న బియ్యం సరఫరాలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసి 14 మంది మిల్లర్లను అరెస్ట్ చేసింది.
నిజామాబాద్, కరీంనగర్, ములుగు జిల్లాల్లోని 16 రైస్ మిల్లుల నుంచి ఎఫ్సీఐకి 3,385.820 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం సరఫరా చేసినట్లు గుర్తించారు.
ఈ వ్యవహారంలో ఇప్పటివరకు మూడు క్రిమినల్ కేసులు నమోదు చేయగా, ప్రభుత్వానికి బోనస్ రూపంలో సుమారు రూ.1.69 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.