
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచే బిల్లుపై చర్చ సందర్భంగా, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసుల్లో 13 ఏళ్లుగా జరుగుతున్న జాప్యాన్ని టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్ రాజ్యసభలో ప్రస్తావించారు.
2013లో నమోదైన సీబీఐ, ఈడీ కేసులు డిశ్చార్జ్ పిటిషన్లు, న్యాయమూర్తుల బదిలీల సాకుతో ఉద్దేశపూర్వకంగానే ముందుకు సాగడం లేదని ఆయన ఆరోపించారు.
న్యాయం ఆలస్యం అవ్వడం అంటే న్యాయం నిరాకరించడమేనని పేర్కొన్న ఎంపీ, ప్రత్యేక సీబీఐ కోర్టులను బలోపేతం చేసి తీర్పులను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.