
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో భాగంగా, 50 దేశాల పౌరులకు వీసా బాండ్ ప్రోగ్రామ్‌ను తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనను తీసుకువచ్చారు.
ఈ కొత్త విధానం ప్రకారం, సంబంధిత దేశాల పౌరులు అమెరికా వీసా పొందాలంటే 20 వేల డాలర్ల మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఈ వీసా బాండ్ ప్రోగ్రామ్‌ను శాశ్వతం చేయాలని నిర్ణయించడంతో, ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆర్థిక భారం పడనుంది.