
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అడియాలా జైలు నుండి ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి శుక్రవారం తెల్లవారుజామున తరలించారు.
మూడేళ్లకు పైగా జైలులో ఉన్న ఖాన్ ఆరోగ్యం క్షీణించిందని, కుడి కంటి చూపు తగ్గిందని ఆయన న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
48 గంటల్లోగా ఆసుపత్రికి తరలించాలని, వ్యక్తిగత వైద్యుడిని అనుమతించాలని మంగళవారం పాక్ సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.