
పాకిస్థాన్ హోంమంత్రి మొహసిన్ నఖ్వీ దేశ పాలనా వ్యవస్థ కుప్పకూలిందని, గత 21 ఏళ్లుగా భారీ కుంభకోణం జరిగిందని సంచలన ఆరోపణలు చేయడంతో ప్రభుత్వంలో అలజడి మొదలైంది.
ఈ ఆరోపణల వెనుక ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ హస్తం ఉందని, షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి సైనిక పాలనకు మార్గం సుగమం చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
నఖ్వీ వ్యాఖ్యలపై రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందిస్తూ, ఆయన తన సొంత పరిపాలనను, పాకిస్థాన్ క్రికెట్ బోర్డును ముందుగా సంస్కరించుకోవాలని కౌంటర్ ఇచ్చారు.