
ఇరాన్‌ను అణ్వాయుధ దేశంగా మారకుండా విజయవంతంగా అడ్డుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో జరిగిన కొలంబస్ డే వేడుకల్లో తెలిపారు.
ఇరాన్‌పై నౌకాదళ దిగ్బంధనం విధించి ఆ దేశ సైనిక సామర్థ్యాన్ని బలహీనపరిచామని, త్వరలోనే ఈ వివాదం ముగిసి చమురు ధరలు తగ్గుతాయని ఆయన జోస్యం చెప్పారు.
గతంలో బీ-2 బాంబర్లతో దాడులు చేయకపోతే ఇరాన్ అణ్వాయుధాన్ని పొంది ఉండేదని, ఆ దాడుల వల్లే ప్రాంతీయ విపత్తును నివారించగలిగామని ట్రంప్ పేర్కొన్నారు.