తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని సవాల్ విసురుతూ బీఆర్ఎస్ నేతలకు హెచ్చరిక జారీ చేశారు.
రాజకీయంగా తనపై విమర్శలు చేస్తున్న కేటీఆర్, హరీశ్ రావులను ఉద్దేశించి సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో వేడి పెరిగింది.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన సీఎం, అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.