
సినిమా షూటింగ్లో గాయపడి మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
ఈ పరామర్శ సమయంలో ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి కూడా చంద్రబాబు వెంట ఉన్నారు.