
శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో గురువారం రాత్రి 10 గంటల సమయానికి ఇన్‌ఫ్లో లక్ష క్యూసెక్కులకు చేరింది.
ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో 827.70 అడుగుల నీటి మట్టం వద్ద 46.823 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, తుంగభద్ర ప్రాజెక్టులో 36.043 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
జూరాల ప్రాజెక్టుకు 1,09,519 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో 17 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు డ్యాం ఎస్ఈ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.