
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.13,884 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది.
గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే లాభంలో 15 శాతం వృద్ధి నమోదు కాగా, కంపెనీ ఆదాయం రూ.73,188 కోట్లకు చేరింది.
కంపెనీ ఒక్కో షేరుకు రూ.12 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించడంతో పాటు నికరంగా 4,258 మంది ఉద్యోగులను పెంచుకుంది.