
భారత్తో జరిగిన మహిళల ఆసియా కప్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించిన పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు ఐసీసీ జరిమానా విధించింది.
షఫాలీ వర్మను అవుట్ చేసిన తర్వాత పెవిలియన్కు వెళ్లాలని చేతితో సైగ చేసినందుకు ఆమె మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించారు.
గత 24 నెలల్లో ఫాతిమా సనా నిబంధనలను ఉల్లంఘించడం ఇది రెండోసారి కావడంతో ఆమె ఖాతాలో మరో డీమెరిట్ పాయింట్ చేరింది.