లాస్ ఏంజిల్స్ అకాడమీ మ్యూజియంలో జరిగిన ‘రామాయణం’ సినిమా స్పెషల్ ప్రీమియర్ షోకు హాజరైన నటి సాయి పల్లవి రావణుడి పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు.
‘రావణుడు పూర్తిగా చెడ్డవాడేమీ కాదు.. మనందరిలోనూ ఉన్న రావణాసురుడిని గుర్తించి మార్పు చేసుకోవాలి’ అని ఆమె పేర్కొన్నారు.
పురాణాల్లో రావణుడు చేసిన అకృత్యాలను గుర్తుచేస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమె వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేక్తను వ్యక్తం చేస్తున్నారు.