
ప్రభుత్వాన్ని, పార్టీని అప్రతిష్ఠపాలు చేసేలా మాట్లాడుతున్న కొండా సురేఖ, సుస్మితలపై ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదవుల్లో ఉండి స్వార్థపూరిత వ్యాఖ్యలు చేస్తున్న వీరిద్దరూ ముఖ్యమంత్రికి వెంటనే క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్న వారి తీరుపై అధికార పార్టీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు.