
దులీప్ ట్రోఫీ ఫైనల్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ 4 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది.
కెప్టెన్ ఇషాన్ కిషన్ 111 పరుగులతో అజేయంగా నిలవగా, అభిమన్యు ఈశ్వరన్ 72, శిఖర్ మోహన్ 85, కుమార్ కుషాగ్ర 63 పరుగులు చేశారు.
సౌత్ జోన్ బౌలర్లలో మిలింద్ రెండు వికెట్లు, త్రిపురాణ విజయ్ ఒక వికెట్ సాధించారు.