
సౌదీకి విమాన సర్వీసుల రద్దును నవంబర్ 14 వరకు పొడిగిస్తున్నట్లు ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ శుక్రవారం ప్రకటించాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమై సౌదీలోని విమానాశ్రయాలపై దాడులు జరగడంతో జెడ్డా, రియాద్, దమ్మామ్కు రాకపోకలు నిలిపివేశారు.
ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తేదీలను మార్చుకునేలా లేదా రీఫండ్ పొందేలా వెసులుబాటు కల్పించారు.