
విశాఖపట్నంలో జరగనున్న వినూ మన్కడ్ ట్రోఫీ 2026 కోసం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ 16 మందితో కూడిన అండర్-19 జట్టును ప్రకటించింది.
భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు 18 ఏళ్ల ఆర్యవీర్ సెహ్వాగ్ ఈ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నారు.
ఆర్నవ్ బుగ్గా వైస్ కెప్టెన్గా ఎంపిక కాగా, తన్మయ్ చౌదరి, ఆర్యన్ శర్మ తదితరులకు జట్టులో స్థానం లభించింది.