
సీనియర్ నటి పావలా శ్యామల (75) మంగళవారం ఉదయం హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు.
దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించిన ఆమె, గత కొంతకాలంగా ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
బుధవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.