
తెలంగాణలో థియేటర్ల వర్గీకరణ, టికెట్ ధరల సవరణకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 77ను సవరించాలని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సీఎం రేవంత్ రెడ్డిని కోరింది.
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఉన్న 400కు పైగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఈ కొత్త మార్గదర్శకాల వల్ల మూతపడే ప్రమాదం ఉందని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
గడిచిన మూడేళ్లలో థియేటర్ల ఆధునీకరణ కోసం యాజమాన్యాలు రూ. 300 కోట్లు ఖర్చు చేశాయని, నిర్వహణ ఖర్చులు 30% పెరిగిన నేపథ్యంలో జీవోను సవరించాలని వారు విజ్ఞప్తి చేశారు.