
దానం నాగేందర్ అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ తెలిపారు.
ఈ అంశంపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.
తెలంగాణలో అనర్హత అంశంపై మాట్లాడే ముందు దేశవ్యాప్తంగా బీజేపీ సాగిస్తున్న ఫిరాయింపులపై కిషన్రెడ్డి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.