గత 15 ఏళ్లలో 38 మందిని చంపి తిన్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముజురిజి మోజెస్ అనే వ్యక్తిని ఉగాండా భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి.
2010 నుంచి 2025 మధ్యకాలంలో మసాకా, ఇబాండా, కాజో జిల్లాల్లో ఈ దారుణాలకు ఒడిగట్టినట్లు ఆర్మీ చీఫ్ వెల్లడించారు.
నిందితుడికి బహిరంగ విచారణ జరిపి తప్పకుండా మరణశిక్ష విధిస్తామని జనరల్ ముహూజీ కైనెరుగాబా తెలిపారు.