సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల్లో సర్వే నంబర్ 325లోని భూముల వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
రికార్డుల ప్రకారం 388 ఎకరాలు ఉండాల్సిన భూమి క్షేత్రస్థాయిలో 343 ఎకరాలే ఉండటంతో.. వచ్చిన 45 ఎకరాల తేడాపై సీఎం ఆరా తీశారు.
ఈ భూములకు ఆనుకుని ఉన్న మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల నుంచి రెవెన్యూ రికార్డులు సమర్పించాలని నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.