
అఫ్గానిస్థాన్‌పై పాక్ సైనిక పాలకులు మరోసారి వైమానిక దాడులకు పాల్పడ్డారని స్థానిక అధికారులు తెలిపారు.
హెల్మాండ్ ప్రావిన్స్ గార్మసిర్ జిల్లాలోని రెండు ఇళ్లపై జరిగిన ఈ దాడిలో నలుగురు మరణించగా, ఆరుగురు గాయపడ్డారని, వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులేనని సమాచార శాఖ వెల్లడించింది.
సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు పాక్ చెబుతుండగా, తాలిబాన్లు మాత్రం అఫ్గాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ మండిపడుతున్నారు.