
జపాన్‌కు చెందిన తకేడా ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన 'క్యూడెంగా' డెంగీ టీకా 2027 తొలి ఆరు నెలల్లో భారత ప్రైవేటు మార్కెట్‌లోకి రానుంది.
ఈ టీకా పంపిణీ, మార్కెటింగ్ బాధ్యతలను హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ దక్కించుకుంది.
నాలుగు రకాల డెంగీ వైరస్‌ల (డీఈఎన్‌వీ-1, 2, 3, 4) నుంచి రక్షణ కల్పించే ఈ టీకాను 4 నుంచి 60 ఏళ్ల వయసు వారికి రెండు డోసులుగా ఇవ్వనున్నారు.