
గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథ్ ఫ్యాటీ లివర్ సమస్యను అదుపులో ఉంచేందుకు యాపిల్, కివి, రాస్ బెర్రీస్, బ్లూ బెర్రీస్, బేరి పండ్లు, అవకాడో, దానిమ్మ గింజలను సూచించారు.
పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఈ పండ్లు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని, వీటిని పెరుగు లేదా ఓట్ మీల్‌లో కలుపుకుని తీసుకోవచ్చని ఆయన తెలిపారు.
అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయని, కివి మలబద్ధకానికి మేలు చేస్తుందని, అయితే అలర్జీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు.