
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ ఏడీ జయరాజు ఇళ్లలో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు చేపట్టారు.
వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్, భూపాలపల్లి, సూర్యాపేట, తాండూరు ప్రాంతాల్లోని మొత్తం 12 చోట్ల ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.
తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన ఈ దాడుల్లో జయరాజు అక్రమ ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం.