
హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన ఇద్దరి అవయవదానంతో మొత్తం 8 మంది రోగులకు కొత్త జీవితం లభించింది.
కామారెడ్డికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వినయ్, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పద్మ ఆండాళు కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు.
ఈ రెండు ప్రక్రియలతో తెలంగాణలో జీవన్ దాన్ కార్యక్రమంలో అవయవదానాల సంఖ్య 150వ మైలురాయిని చేరుకుంది.