
హెచ్. వినోత్ దర్శకత్వంలో సూర్య హీరోగా రానున్న 'సూర్య 49' చిత్రంలో కీలక పాత్ర కోసం నాగార్జునను మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం.
ఈ చిత్రంలో నాగార్జున నెగెటివ్ షేడ్స్ ఉన్న పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా 2027లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని రిపోర్టులు చెబుతున్నాయి.