భారతరత్న, దిగ్గజ కర్ణాటక సంగీత గాయని ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న బయోపిక్‌లో రష్మిక మందన్న ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
'ఎం.ఎస్ - ఎ లెగసీ ఆన్ స్క్రీన్' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు.
చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవంలో అగ్ర నటుడు కమలహాసన్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ ఇచ్చారు.