వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని, దీని ప్రభావంతో ఏపీలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55-65 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని హెచ్చరించారు.
ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా బుధవారం వరకు మత్స్యకారులు ఏడు మీటర్ల కన్నా తక్కువ వెడల్పు ఉన్న పడవల్లో వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.