
ముక్కోణపు టీ20 సిరీస్లో భాగంగా జరిగిన మ్యాచ్లో నమీబియా 18 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై సంచలన విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 163 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 145/9 స్కోరుకే పరిమితమైంది.
నమీబియా బౌలర్లు రూబెన్ ట్రంపెలమన్, జేజే స్మిత్ చెరో 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.