
భారత్లో మహీంద్రా గ్రూప్ తయారు చేస్తున్న బీఎస్ఏ బ్యాంటమ్ బైక్ను యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ నడిపి, దాని పనితీరును ప్రశంసించారు.
1861లో స్థాపించిన బీఎస్ఏ కంపెనీలో 2016లో మహీంద్రా గ్రూప్ 100 శాతం వాటాను కొనుగోలు చేసి, ప్రస్తుతం బైక్లను అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతి చేస్తోంది.
ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో పంచుకుంటూ, భారత్-బ్రిటన్ సాంకేతిక సహకారానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.